ఏపీలో ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వైద్యులు ఇంటి వద్దకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, ప్రతి రోజు పల్లెల్లో అందుబాటులో ఉంటారని సీఎం తెలిపారు. దీని ద్వారా రోగాలు ముదరక ముందే గుర్తించి చికిత్స పొందవచ్చన్నారు. క్యాన్సర్, గుండె, టీబీ వంటి రోగాలకు కూడా గ్రామాల్లోనే చికిత్స పొందవచ్చన్నారు. ఈ పథకం దేశానికి రోల్ మోడల్ అవుతుందని సీఎం జగన్ అన్నారు.