వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ పిలుపునిచ్చారు. కూడేరు బహిరంగ సభలో ఉరవకొండ నియోజకవర్గ అభ్యర్థిగా కేశవ్‌ను లోకేశ ప్రకటించారు. కేశవ్ చేతిని పైకెత్తి.. కార్యకర్తలకు అభివాదంచేశారు. దీంతో బహిరంగ సభకు హాజరైన టీడీపీ కార్యకర్తలు కేశవ్‌కు సంఘీభావం తెలుపుతూ కేరింతలు కొట్టారు.