‘గత ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికి స్కాలర్‌షిప్‌లు వచ్చేవి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి పేరుతో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఆ పథకాన్ని వర్తింపచేసి, దళిత పిల్లల చదువులకు తీవ్ర అన్యాయం చేశారు’ అని అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాయి. ఈ ప్రభుత్వంలో కార్పొరేషన్‌లో అలంకారప్రా యంగా పదవులు ఉన్నాయే తప్ప ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి కేటాయించలేదు. అమరావతి రాజధాని గా అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందేది. అమరా వతిపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి. అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అని పిలుపుని చ్చారు. సర్పంచ్ గద్దల సుహాసిని మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.