డబ్బు కోసం స్నేహితుడిని హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ‘జంగారెడ్డిగూడెం మండలం మైసన్న గూడెంకు చెందిన తోణం శివ, వేగవరానికి చెందిన కొప్పర్తి రామకృష్ణ స్నేహితు లు. శివ ఆయిల్ ఫామ్ గెలలు నరకడం, పొగాకు క్యూరింగ్ పనులు చేస్తుండగా రామకృష్ణ తాపీ పని చేస్తాడు. వీరిద్దరూ అప్పుడప్పుడు కలిసి మద్యం సేవిస్తూ ఉంటారు. కొన్నిరోజుల క్రితం రామకృష్ణ మరో స్నేహితుడు బాలాజీ డబ్బులు అవ సరం నిమిత్తం మోటారు సైకిల్ తాకట్టు పెట్టి రూ.11 వేలు తీసుకు రమ్మని చెప్పాడు. రామకృష్ణ దానిని రూ.13 వేలకు తాకట్టు పెట్టి, రెండు వేలు వాడుకుని రూ.11 వేలు బాలాజీకి ఇచ్చాడు. కొన్ని రోజులకు బాలాజీ రూ.11 వేలకు వడ్డి మరో వెయ్యి కలిసి రూ.12 వేలు ఇచ్చి బైక్‌ను విడిపించి తీసుకు రావాలని కోరా డు. రామకృష్ణ రెండు వేలు వాడుకున్న విషయం బాలాజీకి తెలియదు. ఈ రెండు వేలను అప్పుగా ఇవ్వాలని స్నేహితుడు తోణం శివను అడిగాడు. తన వద్ద లేవని చెప్పాడు. కాగా ఈ నెల 1న శివకు బాకీ ఉన్న ఇద్దరు రైతులు రూ.15 వేలు ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఎలాగైనా కాజేయాలని నిర్ణయించాడు. ఈ నెల ఒకటో తేదీ రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అర్ధరాత్రి శివ ఇంటిలోని పొగాకు బేరన్ వద్ద నిద్రిస్తున్నాడు. శివ తలపై ఐరన్ రాడ్డుతో కొట్టి గాయపరిచి, అతని సెల్ ఫోన్, 15 వేల నగదు అపహరించాడు. ఈ దారుణాన్ని చూసిన శివ భార్యను, వారి కుమారుడిని తీవ్రంగా గాయపరిచాడు. ఆమె మెడలో బంగారు సూత్రాలు, చెవి దుద్దులు బలవంతంగా లాక్కొని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఈ ఘటనలో శివ చనిపోగా, భార్య, కుమారుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీఐ బాల సురేష్ దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రామకృష్ణను అరెస్టు చేసి 14 వేల నగదు, సెల్‌ఫోన్, బంగారు ఆభరణాలు, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావే శంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ, ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.