ఏపీ సీఎం జగన్ ఎదుటే మంత్రి విడదల రజిని కన్నీళ్లు పెట్టుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట మండలం లింగంగుంట్లో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఈక్రమంలో తన రాజకీయ జీవితం, పదవులు జగన్ పెట్టిన భిక్ష అంటూ భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు. తనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.