ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోధుమ పొలంలో అకస్మాత్తుగా మంటలు చేలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 50 ఎకరాల గోధుమపంట కాలిబూడిదైంది. గ్రామస్తుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలార్పడానికి యత్నిస్తున్నారు. ఈ ఘటన మధుర జిల్లా రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయరాంపూర్ గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంతో భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa