ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మారని డ్రాగ్ దేశం తీరు... మళ్లీ అదే వాదన

international |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 09:07 PM

చైనా  దేశం  గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మనదేశ సరిహద్దులలో జోక్యం చేసుకొంటూనే ఉంది. ఇటీవల  అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిక్త అటవీ ప్రాంతాలు, అసంఖ్యాక శిఖరాలు, ఉనికిలో లేని నదులు, పట్టణ ప్రాంతాలకు యాదృచ్ఛికంగా భౌగోళిక ప్రామాణిక పేర్లు పెట్టడ ద్వారా చైనా మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. ఉదాహరణకు చైనా ‘కిబూరి హీ’, ‘గెడువో హీ’ అని పేరు పెట్టిన రెండు నదులను సివిల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీటిని నిర్దిష్ట స్థానాలు అని పేర్కొంది. ‘బాంగ్‌కిన్’ అనేది తవాంగ్ జిల్లాలోని భారతదేశపు చిట్ట చివరి గ్రామమైన జెమితాంగ్‌కు ఆవల ఉన్న అటవీ పర్వత ప్రాంతంలోని భూమిని సూచిస్తుంది. ఇది సరిహద్దును గుర్తించే మెక్‌మాన్ రేఖకు దగ్గరగా ఉంది.


బెంగాల్‌లోని కలైకుండ ఎయిర్‌బేస్‌ వేదికగా కోప్ ఇండియా IAF-US వైమానిక దళ విన్యాసాలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానుండగా చైనా ఈ చర్యలకు దిగడం గమనార్హం. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2 విడుదల చేసిన జాబితాలో టిబెటన్, చైనీస్ పిన్యిన్ లాటిన్ వర్ణమాలలో స్థానిక పేర్లు, పదాలను ఉపయోగించింది. చైనా కుయుక్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌.. అరుణాచల్‌ ఎప్పటికీ తమ అంతర్భాగమేనని స్పష్టం చేసింది. చైనా ఇలా పేర్లు మార్చడం మొదటి సారి కాదని, డ్రాగన్ చర్యలను తిరస్కరిస్తున్నామని పేర్కొంది.


అయితే, చైనా మాత్రం ఇది తమ సార్వభౌమ హక్కని వాదిస్తోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మాట్లాడుతూ.. ‘జాంగ్నామ్ (అరుణాచల్ ప్రదేశ్) చైనాలో భాగం.. స్టేట్ కౌన్సిల్ భౌగోళిక పేర్ల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా చైనా ప్రభుత్వం సమర్థ అధికారులు జాంగ్నాన్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను ప్రామాణికం చేశారు. ఇది చైనా సార్వభౌమ హక్కుల పరిధిలోకి వస్తుంది’ అని అన్నారు. పేర్ల మార్పు పూర్తిగా చైనా సార్వభౌమాధికార పరిధికి సంబంధించిందని ఆమె స్పష్టం చేశారు. దక్షిణ టిబెట్ రీజియన్ చైనా ప్రాంతమని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com