జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో చెన్నైలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు.ఆయనికి 56 సంవత్సరాలు. జాగర్నాథ్ మహతో మరణాన్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధృవీకరిస్తూ ఆయన మరణం కోలుకోలేని నష్టమని అన్నారు.గత నెల జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో ఆరోగ్యం క్షీణించడంతో జాగర్నాథ్ మహతో చెన్నైలో చికిత్స పొందుతున్నారు. అతను జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందినవాడు మరియు ప్రస్తుత జార్ఖండ్ అసెంబ్లీలో డుమ్రీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. డుమ్రీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా జాగర్నాథ్ మహతో మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.