ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ప్రైవేట్ రెస్టారెంట్ రూ.1కే బిర్యాని ఇస్తున్నామని ప్రకటించింది. ప్రారంభోత్సవం సందర్భంగా పాత రూపాయి నోట్‌కు దమ్ బిరియాని అని ప్రకటించడంతో జనం పెద్దఎత్తున ఎగబడ్డారు. తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసి నిలిపేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మార్కాపురం - కంభం రహదారిపై ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa