ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం, బంధంచర్ల పంచాయతీలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బంధం చర్ల గ్రామస్తుల వద్దకు వెళ్లి జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో వివరించి 15 అంశాలపై వారి వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. అనుభవం ఉన్న నాయకుడు, అభివృద్ది చేయగలిగిన నాయకుడు చంద్రబాబు మాత్రమేనని శ్రీనివాసులు పేర్కొన్నారు.