బీజేపీ నుండి దేశానికి విముక్తి కలిగించాలని సీపీఐ కడప జిల్లా కార్యదర్శి నరసింహులు పిలుపునిచ్చారు. ములకలచెరువులో నియోజకవర్గ కార్య దర్శి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ సీపీపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదానీ, అంబానీలకు ఊడిగం చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నాడన్నారు. గ్యాస్, పెట్రో ధరలను ఏ మాత్రం నియంత్రించడం లేదన్నారు. ఈ విధానాలపై పోరాటాలు కూడా చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1ని తెచ్చి నిరంకుశ పాలన చేస్తోందన్నారు. నియోజకవర్గ ఇనచార్జి కృష్ణప్ప మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు అంజనప్ప, సలీంబాషా, ఆనంద్, తంబ య్యశుట్టి, గంగులప్ప, జయకర్, రామచంద్ర, భాస్కర, వెంటకస్వామి. సుధాకర్, అంజలమ్మ, డీహెచపీఎస్ జిల్లా అధ్యక్షుడు హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa