కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ ఎం. శ్రీనివాసరావు మరియు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు లు కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం కార్యనిర్వాహధికారి వెంకటేశు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మరియు ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీనివాస్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa