మార్చి నెలలో అమెరికా కంపెనీలు కొత్తగా 2,36,000 ఉద్యోగాలను సృష్టించాయి. గతేడాది నుండి అమెరికా ఫెడరల్ రిజర్వ్ 9 సార్లు వడ్డీ పెంచినప్పటికీ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ విపణి బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మార్చిలో నిరుద్యోగ రేటు 3.5 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో 3,26,000 ఉద్యోగాలతో పోలిస్తే మార్చిలో కాస్త తగ్గాయి. అలాగే ఫిబ్రవరిలో సగటు గంటల వేతనాలు 4.6 శాతం పెరగగా, మార్చిలో మాత్రం 4.2 శాతం పెరిగాయి.