కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భి. కృష్ణ మోహన్ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వేదాశీర్వాద మండపంలో వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు మరియు జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో సి. ఐ శ్రీనివాసులు రెడ్డి, సూపర్డెంట్ శ్రీనివాస్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తవణంపల్లి ఎస్. ఐ ప్రసాద్, ఐరాల ఎమ్మార్వో, తదితరులు పాల్గొన్నారు.