మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ అమానవీయ ఘటన జరిగింది. నగరంలో మద్యం షాపుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. అందులో ఓ మహిళపై పోలీసులు దారుణంగా ప్రవర్తించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళ జుట్టుపట్టుకుని కొడుతూ, తిడుతూ లాకెళ్లారు. మిగతా ఆందోళనకారులతో కూడా ఇలాగే వ్యవహరించారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa