రాయదుర్గం పట్టణంలోని కోట ప్రసన్న వెంకటేశ్వరుడి ఆలయ అభివృద్ధికి అదనంగా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్పర్సన్ కాపు భారతి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలయ ప్రహరీ, ఆలయంలో మందిరాల నిర్మాణం, ఫ్లోరింగ్ లాంటి పనులకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు. త్వరలో ప్రారంభమయ్య శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో పాటు మీరు కూడా రావాలని ఆమె ఆహ్వానించారు.