రాజాం అసెంబ్లీ నియోజకవర్గం వంగర మండలంలోని మగ్గూరు గ్రామంలో జగన్ అన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఆదివారం జరిగింది. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల గూర్చి అడిగి తెలుసుకొంటూ వారి అనుమతితో ప్రతి ఇంటికి తిరిగి "మా నమ్మకం నువ్వే జగన్" స్టిక్కర్లు అంటించడం జరిగింది. అనంతరం కన్వీనర్లకు, గృహ సారథులుకు జగనన్నే మా భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పొలిరెడ్డి రమేష్, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామవలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa