ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకృతి పరిరక్షణ అనేది భారతదేశ సంస్కృతి: ప్రధాని నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 09:03 PM

ప్రకృతి పరిరక్షణ అనేది భారతదేశ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్ సందర్శన అనంతరం మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో పులుల సంఖ్యపై నివేదికను విడుదల చేశారు. దేశంలో పులుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. 2022లో పులుల సంఖ్య 2,967 నుంచి 3,167కి పెరిగిందని వివరించారు.


ప్రకృతి పరిరక్షణ అనేది భారతదేశ సంస్కృతి అని మోదీ పేర్కొన్నారు. అందుకే వన్యప్రాణి సంరక్షణలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ అనేక ఘనతలను సాధించిందని తెలిపారు. ప్రపంచ భూభాగంలో 2.4 శాతం భూమిని కలిగివున్న భారత్ 8 శాతం జీవ వైవిధ్యానికి వేదికగా నిలుస్తోందని వివరించారు. 


ఇవాళ పులులు, ఏనుగులు (30 వేలు), ఆసియాటిక్ ఏనుగులు, సింగిల్ హార్న్ ఖడ్గమృగాలు (3 వేలు), ఆసియాటిక్ సింహాల విస్తృతి పరంగా భారత్ అగ్రస్థానంలో ఉందని మోదీ వెల్లడించారు. గడచిన నాలుగేళ్లలో దేశంలో చిరుత పులుల సంఖ్య 60 శాతం పెరిగిందని తెలిపారు. స్వచ్ఛమైన నదులు జీవ వైవిధ్యానికి ఎంతో తోడ్పతాయని, అందుకే దేశంలో నదులను పరిశుభ్రం చేసే కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com