ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 10, 2023, 11:12 AM

కోసిగి: రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు అని, వచ్చేది తెలుగుదేశం పార్టీ అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ ఆదేశాలు మేరకు కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్ అధ్యక్షతన కోసిగిలో కరెంట్ ఆఫీసు దగ్గర పెంచిన విద్యుత్ చార్జ్ లు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని, ప్రజలుపై పెంచిన కరెంటు చార్జీలతో 57 వేల కోట్ల రూపాయలు భారం పడింది అని, వెంటనే అన్ని విద్యుత్ చార్జ్ లు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అన్నీ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ఐ టీడీపీ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com