ఇంటింటికీ జనసేన కార్యక్రమంలో భాగంగా తిరుపతి సురేష్, అనూష ఆధ్వర్యంలో ఆయన విజయవాడ 42వ డివిజన్‌లో పోతిన వెంకట మహేష్ పర్యటించారు. ఇంటింటికీ తిరిగి జనసేన వాగ్దాలున్న కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ప్రియదర్శిని కాలనీలో ప్రకాశం జిల్లా పొదిలి నుంచి వలస వచ్చిన యాదవరాజు తనకు విద్యుత్ బిల్లుల కారణంగా పెన్షన్ నిలిపివేశారని, అమరావతిలో ఇల్లు ఎప్పటికి వస్తుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే పని దొరుకుతోందని, చాలీచాలని ఆదాయంతో బతకడం కష్టమవుతోందని, తిరిగి సొంత ప్రాంతానికి వెళితే, అద్దె భారం తప్పుతుందే మోనని వాపోయాడు. ఖాళీ స్థలాలు కనిపిస్తే వైసీపీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని, కార్పొరేటర్ చైతన్యరెడ్డికి బ్యానర్లు తప్పితే ప్రజలు కనిపిం చడం లేదన్నారు. క్రాంబేరోడ్డుకు ఖుద్దూస్‌రోడ్డుగా పేరు మార్చాలని, ఈ పేరును కాదని చైతన్యరెడ్డి వేరొక పేరు సూచించడం సబబు కాదన్నారు. తిరుపతి సురేష్ అనూష మాట్లాడుతూ.. నాలుగేళ్లలో వైసీపీ చేసిందేమి లేదన్నారు. పగడాల సుబ్బారావు, ఆవుల ప్రసాద్, రామచంద్రరావు, కొరగంజి వెంకటరమణ, రెడ్డిపల్లి గంగాధర్ పాల్గొన్నారు.