ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ అవుతుంటుంది. వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ ద్వారా దీనికిి చెక్ పెట్టవచ్చు. పుచ్చకాయను నేరుగా తిన్నా లేదంటే జ్యూస్‌గా తీసుకున్నా శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఉక్కపోత, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. పుచ్చకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్లు ఉంటాయి. వీటి వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు.