పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయమని ఆ పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ కన్వీనర్ నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్లలో సామాజిక న్యాయ వారోత్సవాలను నిర్వహించారు. లావేరులో 40 మంది పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆ పార్టీ మండలాల అధ్యక్షులు ఇజ్జాడ శ్రీనివాసరావు, వజ్జపర్తి రఘురాం, సంపతిరావు నాగేశ్వరరావు, నేతలు పీవీరత్నం, పతివాడ అప్పల నాయుడు, పతివాడ పైడినాయుడు, మీసాల రామకృష్ణ, డి.రాజేంద్రప్రసాదర్, వావిలపల్లి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa