పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులను అనుసరించి డీఎస్సీ 1998కు సంబంధించిన అభ్యర్థుల్లో ఎంపికైన 355 మంది మెరిట్ కమ్ సెక్షన్ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ వివరాలను వెబ్సైటు లో వుంచినట్టు ఆమె వెల్లడించారు. ఆ జాబితాలో పేర్లు కలిగిన అభ్యర్థులు కనీసపు టైమ్ స్కేల్‌లో కాంట్రాక్టు అగ్రిమెంట్‌పై పనిచేస్తామని మంగళవారం ఉదయం పది గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పత్రాలు సమర్పించాలన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నామన్నారు. కౌన్సెలింగ్ తేదీ, స్థలం వివరాలను పత్రికా ప్రకటన ద్వారా గానీ, కార్యాలయంలో నోటీస్ బోర్డు ద్వారా తెలియజేస్తామన్నారు. అభ్యర్థులు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa