రాజకీయాలలో జే.సీ.బ్రదర్స్ స్టయిలే వేరబ్బా అంటారు ఎవరైనా..ఇదిలావుంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్ కు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు లోకేశ్ తో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెంచారు. డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేస్తూ ఆయన సందడి చేశారు. తనతో పాటు పక్క వాళ్లతో కూడా స్టెప్పులు వేయిస్తూ హుషారును పెంచారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ఆయనొక బఫూన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa