మట్టి పరీక్షలపై జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులకు, రైతు భరోసా కేంద్రం గ్రామ వ్యవసాయ సహాయకులకు స్థానిక రోటరీ క్లబ్‌లో మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి ఐ. మురళి అధ్యక్షత వహించి పలు అంశాలపై క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు. పొలంలో మట్టి నమూనాల సేకరణ విధానము, చతుర్విభజన పద్ధతిలో మట్టి నమూనా తీసి సమాచార పత్రం జతచేసి ప్రయోగశాలకు పంపడం మొదలైన అంశాలను వివరించారు. భూసార పరీక్ష అవసరాన్ని చెప్పారు. డిఎఎటిటిసి డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ వివిధ నేల రకాలు, వాటి భౌతిక, రసాయనిక లక్షణాలను తెలిపారు. భూసార పరీక్షా కేంద్రంలో నిర్వహించే పరీక్షలు, అందుకు అనుగుణంగా ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. జిల్లా శిక్షణా అధికారి ఎం. శివకుమారి మాటాడాడుతూ పల్నాడు జిల్లాలోని నేల రకాలను, సమస్యాత్మక నేలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.