భారత్‌లో భూప్రకంపనలు సంభవించాయి. బిహార్, పశ్చిమ బెంగాల్‌లో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూమి ఒక్కసారిగా కంపించటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. రోడ్లపైకి పరుగులు తీశారు. కాగా.. ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.