తమ దేశపు వీసా ఫీజులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. 2014 తర్వాత ఇప్పుడే ఫీజులు పెంచుతున్నామని, ప్రస్తుతం 8 రకాల వీసాల ఫీజు పెంచామని తెలిపింది. వీటిలో పర్యాటక వీసా బీ1/బీ2 ఫీజు సైతం ఉండడం గమనార్హం. బీ1/బీ2 వీసాపై 25 డాలర్లు, హెచ్, ఎల్, ఓ, పీ, క్యూ, ఆర్ వీసాలపై 15 డాలర్లు, ఇ వీసాపై 110 డాలర్లు పెంచారు. వీసాలకు సంబంధించి 10 లక్షల దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa