కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో బుధవారం కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. వైద్య శిబిరంలో డాక్టర్ రవి ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొని బీపీ, షుగర్ , థైరాయిడ్ రోగాలతో బాధపడుతున్న వారిని పరీక్షించి ఉచితముగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు రిఫర్ చేశారు. గ్రామంలో సుమారు 300 మందికి వైద్యం అందించినట్లు డాక్టర్ రవి ప్రసాద్ తెలిపారు.