రాష్ట్రంలో కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిపోయిందని శ్రీకాకుళం మాజీ శాసన సభ్యురాలు గుండ లక్ష్మీదేవి విమర్శించారు. మంగళవారం సాయంత్రం ఇదేమి ఖర్మ - మన రాష్టానికి కార్యక్రమంలో భాగంగా స్థానిక పిఎన్ కాలనీలో ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో వైసిపి పాలనలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, అరాచక పాలన పట్ల ప్రజలకు అవగాహన కలిగించారు. అదేవిదంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు ఆకాశానంటేయని, దీంతో పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ మద్దతు తెలిపి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ మాదారపు వెంకటేష్, క్లస్టర్ ఇంచార్జ్ శిల్లా శ్రీనివాస్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పి ఎం జె బాబు, మీడియా కోఆర్డినేటర్ జామి బీమాశంకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి రమణ మాదిగ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.