ప్రజలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అవగాహన కల్పించాల్సిన పోలీసులు సైతం తరచుగా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘింటే పోలీసులపై డబుల్ ఫైన్ విధించాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారిపై శాఖాపరమైన చర్యలు సైతం తీసుకుంటామని హెచ్చరించింది. ఈమేరకు రాజస్థాన్ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.