మహారాష్ట్రలో బ్యాంక్ మేనేజర్‌పై ఓ బీజేపీ నేత దాడికి పాల్పడ్డాడు. బీడ్ నగరంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ మేనేజర్ రామ్ ప్రసాద్‌పై బీజేపీ నాయకుడు నవనాథ్ దాడి చేసి చితక్కొట్టాడు. ఈ మేరకు నవనాథ్తో పాటు అతని అనుచరులపై కేసు నమోదైంది. అయితే సదరు బ్యాంక్ మేనేజర్ కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించడం, వేధింపులకు గురిచేయటంతోనే దాడి జరిగినట్లు సమాచారం. దాడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.