రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయననున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో కంప్యూటర్ బటన్‌నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైయస్ జగన్ ప్రభుత్వం వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తోంది.