ట్రెండింగ్
Epaper    English    தமிழ்

61 రోజులు సముద్రంలో చేపల వేట నిషేధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2023, 03:42 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాలలో చేపల వేట చేయు యాంత్రిక పడవలు అనగా మెకనైజ్డ్, మోటారు బోట్ లు ద్వారా నిర్వహించు అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 61 రోజులు పాటు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చేపల వేట నిషేధం అమలులో ఉంటాయని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సముద్ర జలాలలో చేపల వేట నిషేధం ఉద్దేశ్యం - వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం, తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించడం కోసమని అన్నారు. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు పై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేసిన యెడల ఆయా బోట్ల యజమానులు ఆంధ్ర ప్రదేశ్ సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టము (ఏపీ ఎంఎఫ్ సీ యాక్ట్) 1994, సెక్షన్ (4) ను అనుసరించి శిక్షర్హులు, అట్టి వారి బోట్లను, బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరచుకొనుటయే గాక, జరిమానా విధిస్తు, డీజీల్, ఆయిల్ రాయితీ, ప్రభుత్వం అందించే అన్ని రకముల రాయితీ సౌకర్యాలను నిలుపుదల చేయబడునని తెలిపారు.

ఈ నిషిద్ధ కాలమును ఖచ్చితంగా అమలు చేయుటకై మత్స్యశాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవి, రెవిన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయడమయినదని, కావున మత్స్యకారులు అందరు సహకరించవలసినదిగా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com