విజయవాడలో సీపీఎం, సీపీఐ సంముక్తంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘‘ప్రచార భేరి’’ నిర్వహించారు. ఈ ప్రచారభేరీ సభలో సీపీఎం పొలిట్ భ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, సీపీఐ జాతీయ కార్యదర్మి బినయ్ విశ్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ కారత్ మాట్లాడుతూ... ఇప్పుడు మన దేశాన్ని పాలిస్తున్న వారు స్వతంత్ర సంగ్రామంలో ఎన్నడూ పాల్గొనలేదన్నారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని పాత్యాత్త దోరణిలో కాకుండా మనుస్మృతి అనుసరించాలని చెప్పుకొచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరడలేదని.. వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని వమ్ము చేసి హిందూ రాజ్యం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు నోరు ఎత్తడానికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను భయపెడుతున్నారని ఆయన తెలిపారు.