ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర దిశగా జావా దీవిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జిఎస్) ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. అయితే భూకంప కేంద్రం 594 కి.మీ లోతులో కేంద్రీకృతమైనందున సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.