గుంతకల్లు పట్టణంలోని10 వ వార్డు టిడిపి ఇంచార్జీ రాయల్ వెంకటేష్ ఆధ్వర్యంలో మక్కా మసీదులో శుక్రవారం సాయంత్రం రంజాన్ ఉపవాసం చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్ర గౌడ్ హాజరై ఉపవసమున్న ముస్లింలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. పవన్ కుమార్ గౌడ్, నాయ కులు టి. కేశప్ప, మస్తాన్ యాదవ్, ఫజులు, రంజాన్, హనుమంతు, ఫ్రూట్ మస్తాన్, ఆటోఖాజా, నందీశ్వర, సాదిక్ వలి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa