బిహార్లో ఏకంగా సెల్ టవర్‌నే దోచుకెళ్లారు దొంగలు. ముజఫర్పుర్ జిల్లాలోని శ్రమజీవి నగర్లో ఉన్న GTAL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు చెందిన మొబైల్ టవర్ను విడగొట్టి వాహనంలో తీసుకెళ్లారు. దాంతో పాటు జనరేటర్, స్టెబిలైజర్, మిగతా వస్తువులు సైతం ఎత్తుకెళ్లారు. ఇది తెలిసి ఆశ్చర్యపోయిన మొబైల్ టవర్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టినా ఇప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.