బీహార్‌లోని మోతిహారి ప్రాంతంలో కల్తీ మద్యం కారణంగా 20 మంది మరణించగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ కల్తీ మద్యాన్ని ట్యాంకర్‌లో తీసుకొచ్చి విక్రయించారని, ఆ తర్వాతే మరణాలు సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa