ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ నమ్మశక్యం కాని దార్శనికుడు .... అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జీనా రైమాండో

international |  Suryaa Desk  | Published : Sun, Apr 16, 2023, 09:56 PM

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నమ్మశక్యం కాని దార్శనికుడంటూ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జీనా రైమాండో ఆకాశానికెత్తేశారు. న్యూఢిల్లీలోని ఇండియా హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి తన భారత పర్యటన గురించి ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్‌గా మారింది. ‘‘ఈ మధ్య నేను ఇండియాకు వచ్చి వెళ్లాను. హోలీ వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఓ రోజు ముందుగానే భారత్‌లో దిగాను. ఆ సమయంలో మోదీతో సమావేశమయ్యే అద్భుత అవకాశం దక్కింది. ఆయన నమ్మశక్యం కాని దార్శనికుడు, ప్రజలపై ఆయనకున్న నిబద్ధత మాటల్లో వర్ణించలేం. ప్రజలను పేదరికం నుంచి బయటపడేయాలని, భారత్‌ను ఓ ప్రపంచశక్తిగా ముందుకు నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇది వాస్తవరూపం దాలుస్తోంది’’ అని ఆమె ప్రసంగించారు. కాగా.. భారత్, అమెరికా మధ్య బలపడుతున్న దౌత్యబంధానికి అమెరికా మంత్రి వ్యాఖ్యలు ఓ సంకేతమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa