నేడు ఏపీలోని 116 మండలాల్లో వడగాల్పులతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో చెరో 15 మండలాలు, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో చెరో మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. కాకినాడ జిల్లాలో 9, తూర్పుగోదావరి జిల్లాలో 8 మండలాలు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 10 మండలాలపై వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.