నాగ్‌పూర్ పట్టణంలో నాయక్ సరస్సు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సరస్సులో ఓ పెద్ద తాబేలు ఉన్నట్లు స్థానికులు చర్చించేవారు. అయితే సరస్సులో సుందరీకరణ పనులు చేస్తుండగా ఆ తాబేలు బయటపడింది. ఇది దాదాపు 120 కిలోల బరువు ఉండడంతో చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ తాబేలును సెమినరీ హిల్స్‌లోని ట్రాన్సిట్ సెంటర్‌లో ఉంచామని, మళ్లీ అదే చెరువులో వదులుతామన్నారు. అయితే ఈ తాబేలు ఎలా వచ్చిందనేది తెలియడం లేదు.