కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం మధ్యా హ్నం పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరించి మధ్యాహ్నం మంట పెట్టారు. ఈ మంటలు ప్రమాదవశాత్తు చెట్లను అంటుకుని అక్కడ ఉన్న హౌస్ సర్జన్స్కు చెందిన మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం సమాచారాన్ని తెలుసుకున్న ఆసుపత్రి హెల్త్ ఇన్స్పెక్టర్ సాయిరాం ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమవుతున్న ద్విచక్రవాహనాలపై నీరు చల్లి మంటలను ఆర్చే ప్రయత్నాలు చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పించారు.