ప్రముఖ చిత్రకారుడు బాపు తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఆర్టిస్టు బాలి. లక్షల చిత్రాలు గీసిన చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన ‘చిత్ర’ యానాన్ని కొనసాగించారు. విజయవాడ, హైదరాబాద్‌లో పనిచేసి, సొంతగడ్డ విశాఖలో స్థిరపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలి విశాఖలో మంగళవారం కన్నుమూశారు. భారతీయ ఇతిహాస, పురాణ కథలకు క్రొక్విల్ కలం, కుంచెలతో చిత్ర కళ, వ్యంగ్య చిత్ర రచనలో అపార ప్రతిభను కనబర్చిన బాలి ప్రస్థానం అనితర సాధ్యం.