ఇటీవలి కాలంలో నగర డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ పార్టీ మారుతున్నారంటు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈమేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తన రాజకీయ జీవితం వై. యస్. ఆర్ కుటుంబంతోనే కొనసాగుతుందని స్పష్టం చేసారు. వై. యస్. ఆర్ అంటే తనకు తన కుటుంబానికి ఎంతో గౌరవమని తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు ప్రతిపక్ష నేతలు తనపై చేస్తున్న ఆరోపనలపై ఆయన ఘాటుగా స్పందించారు.
ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డితోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. వై. యస్ జగన్ కు ఆయన ఎల్లప్పుడు విధేయుడిగా ఉంటానని, రాజకీయంగా తన పనితీరు నిబద్దత చూసి తనకు డిప్యూటీ మేయర్ పదవిని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కి ఆయన ఎల్లప్పుడు కృతజ్ఞుడినని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ అధినేత ఏం చెప్తే అది చేయటానికి తాను సిద్దంగా ఉన్నానని కనీస అర్హతలేని వారి వ్యాక్యలను తాను పట్టించుకునేది లేదని ఆయన స్పష్టం చేసారు. 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం సీటును జగన్మోహన్ రెడ్డి కి బహుమతిగా అందిస్తామని విశాఖలో పార్టీ బవోపేతానికి చేయాల్సిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన వెళ్లడించారు. తాను వై. యస్ జగన్ కు హార్డ్ కోర్ సైనికుడిని అని అన్నారు. నేనేమిటో నా అధినేత వై. యస్. జగన్మోహన్ రెడ్డి కి తెలుసని ఎల్లప్పడు పార్టీకి సేవ చేస్తూనే ఉంటానని వచ్చే 2024లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేసారు.