జగనన్నే మా భవిష్యతు కార్యక్రమంలో భాగంగా ఉత్తర నియోజకవర్గం 45వార్డు వై ఎస్ ఆర్ నగర్ లో 45వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనుక్ మంగళవారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు పాల్గొని ఇంటింటికి వెళ్లి జగనన్న పాలనలో జరుగుతున్న మంచి గురించి అడిగి తెలుసుకున్నారు. జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించారు.
ఈకార్యక్రమంలో 45వార్డు అధ్యక్షులు పైడి రమణ, జే సి ఎస్ మండల కన్వీనర్ వెంగళరావు సచివాలయం కన్వీనర్ నేపాల్ శ్రీను, సీనియర్ నాయకులు ఆది లక్ష్మీ, సన్నీ, నాయుడు, దుర్గా, నాని, యేసు, మహేష్, జగదీశ్, గృహ సారథులు, వాలంటరీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.