మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ ( జీవిఎంసీ ) కి కొత్తగా వచ్చిన కమీషనర్ సాయికాంత్ వర్మను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, 3వ వార్డు కార్పొరేటర్ దంపతులు గంటా నూకరాజు, గంటా అప్పలకొండలు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా విశాఖపట్నం జిల్లా పరిస్థితులు ముఖ్యంగా 3 వ వార్డులో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఇరువురు వినతిపత్రం సమర్పించారు. 3వ వార్డులో ఉన్న ఎన్టీఆర్ మినీ స్టేడియం, జమ్ము చెరువు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య, శానిటరీ సిబ్బంది కొరత కారణంగా భీమిలి జోనల్ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను ప్రస్థావించి పరిష్కరించాలని కోరారు. భీమిలి పురాతన పాచుర్యతను వివరించి, ఎంతలా ప్రసిద్ధి చెందిన పట్టణం నేడు అభివృద్ధిలో వెనుకబడి ఉందని, తమరు ప్రత్యేక దృష్టి పెట్టి స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ. అభివృద్ధికి పునాదులు వేయాలని గంటా నూకరాజు, అప్పలకొండ దంపతులు కమీషనర్ ను కోరారు.