ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ట్యాబ్లెట్స్ వేసుకోవడం కామన్. అయితే, మాత్రలు వేసుకునేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ట్యాబ్లెట్స్ వేసిన వెంటనే ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకూడదు. ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలి. కొంతమంది పాలతో మందులు వేసుకుంటుంటారు. పాలు, పాల ఉత్పత్తులతో మందులు తీసుకోకూడదంటున్నారు. మందులు వేసుకున్న తర్వాత ఆకుకూరలు తీసుకోకూడదు.