ఏపీలో శాంతిభద్రతల గురించి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో వివేకా హత్య కేసు పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమీక్షలో చర్చ జరిగినట్లు సమాచారం. కాగా అవినాష్ ఇవాళ CBI విచారణకు వెళ్లనున్నారు.