ఉత్తరప్రదేశ్‌లో బాలుడిని ఓ పోలీసు చావబాదాడు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బాలుడు జీబ్రా క్రాసింగ్ నుంచి తన సైకిల్‌పై రోడ్డు దాటాడు. ఇది గమనించిన అక్కడి పోలీస్ బాలుడిని పిలిచి మందలించే క్రమంలో దారుణంగా కొట్టాడు. జుట్టుపట్టుకుని లాగుతూ చితకబాదాడు. సదరు వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుండగా పోలీసుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.