చిత్తూరులోని కొండమిట్టలో ప్రశాంతి అనే యువతిని గొంతు కోసి చంపేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉంది. నిందితుడి పేరు చక్రవర్తిగా గుర్తించారు. ప్రశాంతి ఆరు నెలలుగా కొండమిట్ట ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఈ బ్యూటీ పార్లర్ కు వచ్చిన చక్రవర్తి ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతి చెందిన యువతి ప్రశాంతి ఓ కానిస్టేబుల్ కూతురుగా తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa